గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలిలోని నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సుముద్రాల సుదర్శనాచార్యులుకు అరుదైన గౌరవం దక్కింది. వేద విజ్ఞానం, జ్యోతిష్యశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా బెంగళూరుకు చెందిన శుక్రాచార్య వేదాంగ విశ్వవిద్యాలయం ఆదివారం గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ గోపీనాధ్ చేతుల మీదుగా పట్టాను అందుకున్నారు. ‘వేదిక్ సైన్స్ స్పెషలైజేషన్ ఇన్ పామిస్ట్రీ అండ్ రెమెడీస్’ అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించగా డాక్టరేట్ ప్రకటించారు. ఈ మేరకు మండల ప్రజలు, ప్రముఖులు ఆయనను అభినందించారు.


