ఖిలా వరంగల్: వరంగల్ ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కొత్త శ్రీప్రియకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. విద్య, సామాజిక, మహిళా సాధికారత, నాయకత్వ ప్రతిభ, వ్యవసాయ రంగాల్లో విశేషంగా కృషిచేసిన శ్రీప్రియ.. వీహబ్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అవార్డుకు ఎంపికై ంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో వీహబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ, సినీయాక్టర్ తన్వి చేతుల మీదుగా శ్రీప్రియ అవార్డు అందుకున్నారు. ఉమ్మడి సుస్థిర వ్యవసాయం–అధిక పంటల దిగుబడి కోసం కృషి చేస్తున్నందుకు అవార్డు దక్కడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.


