భద్రకాళికి ఎస్‌బీఐ చైర్మన్‌ పూజలు | - | Sakshi
Sakshi News home page

భద్రకాళికి ఎస్‌బీఐ చైర్మన్‌ పూజలు

Mar 16 2026 8:37 AM | Updated on Mar 16 2026 8:37 AM

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు పూర్ణచందర్‌, ఆంజనేయులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఎస్‌బీఐ చైర్మన్‌ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. అలాగే, రూ.1.20 లక్షలతో ఆలయ ఆర్చ్‌ గేట్‌కు రంగులు వేయించేందుకు దేవాలయ ధర్మకర్త మూగా శ్రీనివాసరావు కుమారుడు మూగా శ్రీధర్‌ ఆదివారం పెయింటర్‌కు అడ్వాన్స్‌ అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement