పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి

Mar 14 2026 8:46 AM | Updated on Mar 14 2026 8:46 AM

జెడ్పీ సీఈఓ బి.శేషాద్రి

కమలాపూర్‌: నివాస గృహాల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని హనుమకొండ జెడ్పీ సీఈఓ బి.శేషాద్రి సూచించారు. ‘ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక’లో భాగంగా.. శుక్రవారం ఆ యన కమలాపూర్‌లో పర్యటించారు. ఈసందర్భంగా ఫ్రైౖడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా మార్క మొగిలి ఇంటి ఆవరణను పరిశీలించి డ్రమ్ముల్లో ఉన్న నీటి నిల్వలను స్థానిక అధికారులతో కలిసి పారబోశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని పరిశీలించి మాట్లాడారు. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ఉగాది లోపు గృహ ప్రవేశాలు చేసుకోవాలని, మొదటి విడత లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుంటే రెండో విడతలో మండలానికి మరిన్ని ఎక్కువ ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉంటుందన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌ పబ్బు సతీశ్‌, ఎంపీడీఓ గుండె బాబు, సూపరింటెండెంట్‌ కరణ్‌సింగ్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, ఏపీఓ రమేశ్‌, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement