దుగ్గొండి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు మెరుగైన వైద్య సేవలందిస్తారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో నర్సంపేట జనరల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆరుగురు ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ సాంబశివరావు మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందదు అనే అపోహను ప్రజలు తొలగించుకోవాలని సూచించారు. 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ టీకాను వేయించాలని ఆయన కోరారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్, మండల వైద్యాధికారులు కిరణ్‌రాజు, విజయ్‌కుమార్, రాకేశ్, నర్సంపేట జనరల్ ఆస్పత్రి వైద్య నిపుణులు రవితేజ, కావ్య, అనూపమ్, సింధూరి, దివ్య, శివాని, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
సాంబశివరావు


