గీసుకొండ: మండలంలోని గంగదేవిపల్లిని జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి శుక్రవారం గ్రామస్తులు కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కమిటీ ఏర్పాటు కాగా సుమారు రూ.10 లక్షలతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయించారు. కమిటీ అధ్యక్షుడిగా కూసం రమేశ్, సభ్యులుగా గోనె కుమారస్వామి, సోమిడి శ్రీనివాస్, ఆకుల రుద్రప్రసాద్, గోనె మల్లారెడ్డి, నాగరాజు, కూసం లింగయ్య, చల్ల మల్లయ్య, గోనె రాజయ్య, గడ్డమీది బాలరాజు, ముస్కు రమేశ్, చల్ల లింగం, గోపాల్‌రాజు, కూసం మల్లికార్జున్, గోనె సంపత్ వ్యవహరిస్తున్నారు. ఈ నెల 18న గ్రామంలో రాజమౌళి సంతాప సభను నిర్వహిస్తున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించాలని కమిటీ అధ్యక్షుడు కూసం రమేశ్ కోరారు.
ఏర్పాటుకు కమిటీ ఎన్నిక
18న గ్రామంలో సంతాప సభ


