పదవి బాధ్యత.. అలంకారం కాదు | - | Sakshi
Sakshi News home page

పదవి బాధ్యత.. అలంకారం కాదు

Mar 13 2026 7:29 AM | Updated on Mar 13 2026 7:29 AM

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

మరియపురం ఎస్‌ఎస్‌ గార్డెన్‌లో

స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణ

గీసుకొండ: పదవి అనేది బాధ్యత.. అంతేకాని అలంకారం కాదు అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మరియపురం శివారులోని ఎస్‌ఎస్‌ గార్డెన్స్‌లో జిల్లాలోని సర్పంచ్‌లు, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేటర్లు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్‌ కౌన్సిలర్లకు ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై గురువారం ఒక ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళా సర్పంచ్‌లు భర్త చాటు భార్యలుగా ఉండవద్దని, వారి అభిప్రాయాలు గౌరవిస్తూనే ముందుకు సాగాలని హితవు పలికారు. ఇటీవల మరణించిన గంగదేవిపల్లి మాజీ సర్పంచ్‌ కూసం రాజమౌళికి నివాళులర్పించారు. అంతకు ముందు స్టాల్స్‌, ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి పరిశీలించారు. మేయర్‌ గుండు సుధారాణి, కలెక్టర్‌ సత్యశారద, డీసీపీ అంకిత్‌కుమార్‌, డీఎఫ్‌ఓ అనూజ్‌ అగర్వాల్‌, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్మన్లు పెండ్యాల లక్ష్మి, సారంగపాణి, గీసుకొండ తహసీల్దార్‌ ఎండీ రియాజుద్దీన్‌, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ పాక శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా, శిక్షణ కార్యక్రమానికి నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు హాజరు కాలేదు. మంత్రి వెళ్లిన తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరై ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement