సకాలంలో ఇందిరామహిళా శక్తి లక్ష్యాలు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో ఇందిరామహిళా శక్తి లక్ష్యాలు పూర్తిచేయాలి

Mar 12 2026 7:48 AM | Updated on Mar 12 2026 7:48 AM

సకాలంలో ఇందిరామహిళా శక్తి లక్ష్యాలు పూర్తిచేయాలి ఐసీఏఐ వరంగల్‌ బ్రాంచ్‌ కార్యవర్గం ప్రమాణ స్వీకారం

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలపై సంబంధిత విభాగాల ప్రాజెక్టు నిర్వాహకులతో బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ ప్రతి విభాగానికి కేటాయించిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని కోరారు. వ్యవసాయేతర విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పెట్రోల్‌బంకు, సౌరవిద్యుత్‌ యూనిట్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించే మహిళా మార్కెట్‌ పనులను ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా ప్రారంభించాలని తెలిపారు. డీఆర్‌డీఓ మేన శ్రీను, అదనపు డీఆర్డీఓ బొజ్జ వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు నిర్వాహకులు దయాకర్‌, రాజేంద్ర ప్రసాద్‌, అనిత, సరిత, పద్మప్రియ, సీ్త్రనిధి ప్రాంతీయ నిర్వాహకుడు రమేశ్‌ పాల్గొన్నారు.

సమర్థవంతమైన శిక్షణకు ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు నిర్వహించే శిక్షణ సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను అదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్‌డీఓ మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేట: హంటర్‌రోడ్డులోని ఓ ప్రైవేట్‌ కన్వెన్షన్‌హాల్‌లో ఐసీఏఐ వరంగల్‌ బ్రాంచ్‌ అధ్యక్షుడు సీఏ మదరాపు సుజిత్‌, ఇతర కార్యవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా సదరన్‌ ఇండియన్‌ రీజనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఐఆర్‌సీ) చైర్మన్‌, సీఏ ముప్పాల సుబ్బారావు హాజరై మాట్లాడుతూ వరంగల్‌ బ్రాంచ్‌కి సొంత భవనం వచ్చేవిధంగా కృషిచేస్తానని, అన్ని విధాలుగా బ్రాంచ్‌ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు సుజిత్‌ మాట్లాడుతూ సీఏ మెంబర్స్‌, సీఏ విద్యార్థులు, ప్రజలకు ఇన్‌స్టిట్యూట్‌ తరఫున ఉత్తమ సేవలందిస్తామని తెలిపారు. వైస్‌ చైర్మన్‌, సీఏ సుధాటి వినీల్‌రావు, కార్యదర్శి జి.నిఖిత, కోశాధికారి బల్నే భగవాన్‌, స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ హెచ్‌.భరత్‌రాజ్‌, ఎంసీ మెంబర్‌ సత్యనారాయణ, రీజనల్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌, సీఏ మండవ సునీల్‌, రీజినల్‌ కౌన్సిల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ దీపక్‌ లడ్డా, సభ్యుడు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement