● జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రజిని
గీసుకొండ: మలేరియా, డెంగీ తదితర కీటక జనిత వ్యాధులను నివారించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రజిని అన్నారు. గీసుకొండ పీహెచ్‌సీలో ఆశ డే సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె వైద్యులు, సిబ్బందికి వ్యాధుల నియంత్రణపై పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలో గతంలో డెంగీ కేసులు నమోదైన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉండకండా చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్‌సీ డాక్టర్ శౌర్య శరణ్య, డాక్టర్ అరుణ్‌కుమార్, సీహెచ్‌ఓ ప్రసాద్, హెల్త్ సూపర్‌వైజర్ కిరణ్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


