● డీఎంహెచ్‌ఎం సాంబశివరావు
రాయపర్తి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, అందుబాటులో ఉండి సేవలందించకుంటే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. వేసవిలో వచ్చే ఇబ్బందులపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ్‌చంద్ర, సీహెచ్‌ఓ జ్ఞానసుందరి, కమలాగ్రిసి, రవీందర్, సూపర్‌వైజర్లు శ్యాంసుందర్, మథ్యాస్‌రెడ్డి, శోభ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


