‘పది’లో | - | Sakshi
Sakshi News home page

‘పది’లో

Mar 11 2026 9:19 AM | Updated on Mar 11 2026 9:19 AM

‘పది’లో

100% లక్ష్యం

‘పదో తరగతి పరీక్షలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హనుమకొండ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. వందశాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం’ అని హనుమకొండ డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌ అన్నారు. టెన్త్‌ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వివరించారు. ఆయన మాటల్లోనే.. – విద్యారణ్యపురి

నుమకొండ జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా విద్యార్థులను సన్నద్ధం చేయించాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌స్కూళ్లు అన్నింటిలో కలిపి జిల్లాలో 12,079 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలు, 64 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లను నియమించాం. నాలుగు ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, 64 మంది సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించాం.

తొలిసారిగా క్లాక్‌ రూమ్‌

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద తొలిసారిగా క్లాక్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఒక క్లాక్‌ రూమ్‌ ఉంటుంది. విద్యార్థులు ఏవైనా బ్యాగులు, వస్తువులు తీసుకొస్తే ఈ పరీక్ష కేంద్రం వద్ద ఉన్న క్లాక్‌ రూమ్‌ సిబ్బందికి ఇచ్చి లోనకు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల హాల్‌టికెట్లపై క్యూర్‌ కోడ్‌ కూడా ముద్రించారు. దీనిద్వారా పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘ప్రైవేట్‌ యాజమాన్యాలు ఫీజుల పేరిట హాల్‌టికెట్‌ ఇవ్వకపోతే నేరుగా బీఎస్‌ఈ, తెలంగాణ జీఓవీ.ఇన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు హాజరవ్వొచ్చు.

సెల్‌ఫోన్లు ఎవరికీ అనుమతిలేదు..

పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వర్తించే వారికి సెల్‌ఫోన్‌లు అనుమతి లేదు. సీసీ కెమెరాల నిఘాలోనే చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలోనే సీఎస్‌ ప్రశ్నపత్రాల బండిళ్లు విప్పాలి. పరీక్షలు ముగిశాక మళ్లీ సీసీ కెమెరా నిఘాలోనే జవాబుపత్రాల బండిల్స్‌ కట్టాలి. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వర్తించేందుకు 144 సెక్షన్‌ను విధించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ సెంటర్లు మూసివేస్తారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్షల విషయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు హనుమకొండ డీఈఓ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లో (79817 67208)కు సంప్రదించవచ్చు.

ప్రణాళికాబద్ధంగా టెన్త్‌ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత

హనుమకొండ జిల్లాలో పరీక్ష రాయనున్న 12,079 మంది

పరీక్ష కేంద్రాల్లో ఈసారి కొత్తగా క్లాక్‌ రూమ్‌

హాల్‌ టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌

ఈసారి ఒక్కో పరీక్షకు మూడు నుంచి 4 రోజుల వ్యవధి

అన్ని కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు

‘సాక్షి’తో హనుమకొండ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌

పరీక్షల వేళలు

మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 15 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పరీక్షల్లో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టుకు మధ్య మూడు, నాలుగు రోజుల వ్యవధి సెలవులున్నాయి. దీంతో విద్యార్థులు బాగా ప్రిపేర్‌ అ య్యేలా అవకాశం కల్పించారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకో వాలి. ఉదయం 9:35 గంటల తర్వాత లోనికి

అనుమతి ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement