నేత్రదానం సామాజిక బాధ్యతగా భావించాలి
నేత్ర, అవయవ దాతల సంఘం రాష్ట్ర
అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి
దామెర: నేత్రదానంతో ఇద్దరు అంధులకు చూపు వస్తుందని తెలంగాణ నేత్ర, అవయవ, శరీరదాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని నేత్రదాత దుర్గనాల మధురాబాయి సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేత్రదానం అందరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. నేత్రదానం చేసేందుకు 8790538706, 9490133650 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె.మల్లారెడ్డి, ఇంజనీర్ రవీందర్, మధురాబాయి కుమారులు దుర్గనాల జగదీశ్వర్ రావు, దుర్గనాల యోగేశ్వర్‌రావు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.


