భూముల అభివృద్ధికి ‘కుడా’తో అంగీకారం
నయీంనగర్: హనుమకొండ జిల్లా పరిధి వివిధ మండలాల నుంచి భూ యజమానులు 130 ఎకరాల్లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థతో లాండ్ పూలింగ్ ద్వారా అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు. ఇందులో భాగంగా.. బుధవారం ‘కుడా’ కార్యాలయంలో ఆత్మకూరుకు చెందిన భూ యజమానులు తమ సొంత 21 1/2 ఎకరాల భూములను అభివృద్ధి కోసం డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈసందర్భంగా ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, వీసీ చాహత్ బాజ్‌పాయ్ భూ యజమానులతో మాట్లాడారు. కార్యక్రమంలో అధికారులు సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు పాల్గొన్నారు.
స్వచ్ఛ వలంటీర్ల పనితీరు మెరుగుపడాలి
వరంగల్ అర్బన్: నగర వ్యాప్తంగా స్వచ్ఛ ఆటోల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛ వలంటీర్ల పనితీరు మెరుగుపడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. బుధవారం 35వ డివిజన్‌లో క్షేత్ర స్థాయిలో ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణపై తనిఖీ చేశారు. శివనగర్ వాటర్ ట్యాంక్ (అగర్తల ప్రాంతంలో) డక్ట్ నిర్మాణ పనులు పరిశీలించారు.


