రీ సర్వేతో భూ సమస్యలకు చెక్
హసన్‌పర్తి: భూవివాదాల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు అడుగులు వేసింది. భూభారతి చట్టం ద్వారా 1922 నాటి రికార్డులకు స్వప్తి పలకనున్నారు. అత్యాధునిక సాంకేతికతో భూసర్వేకు ముందడుగు వేసింది. గ్రామాల్లో భూ కమతాలు విడిపోవడం, విీస్తీర్ణాలు మారడం వల్ల క్షేత్రస్థాయిలో హద్దులు వివాదాలు పెరిగిపోతున్నాయి. ఈవివాదాలను అధిగమించడానికి ప్రతీ ఇంచు భూమిని కూడా డిజిటల్ పద్ధతిలో సర్వేకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసర్వే పూర్తయిన తర్వాత ప్రతీ భూకమతానికి ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయించనున్నారు. ఇది రైతులకు తమ భూమిపై పూర్తి భద్రత, యాజమాన్య హక్కులను కల్పిస్తోంది.
రెండు పైలట్ గ్రామాల ఎంపిక
రీ సర్వే కోసం హనుమకొండ జిల్లాలోని హసన్‌పర్తి మండలం ముచ్చర్ల, ధర్మసాగర్ మండలంలోని జానకీపురం గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు లైసెన్స్‌డ్ సర్వేయర్‌లను నియమించింది. సాగులో ఉన్న భూమి ఆధారంగా ఎంజాయ్‌మెంట్ సర్వే చేపట్టనున్నారు. సాధ్యమైనంత త్వరలోనే పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద వివాదాలు ఉన్న గ్రామాలను ఎంపిక చేయనున్నారు. కాగా, రీ సర్వే చేపట్టడానికి గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. గ్రామాల రైతులతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారిని ఆహ్వానించనున్నారు. రీ భూసర్వే ద్వారా ఉన్న ప్రయోజనాలు వివరించనున్నారు.
సర్వే నంబర్ల వారీగా కొత్త మ్యాప్‌లు
భూధార్ నంబర్ల కేటాయింపు
పైలట్ ప్రాజెక్ట్‌గా రెండు గ్రామాల ఎంపిక


