డీఆర్‌ఓ గణేశ్‌కు ఐఏఎస్ హోదా
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వైవీ గణేశ్‌కు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, జిల్లాలో గణేశ్ ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తూ డీఆర్‌ఓగా ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు అదనపు కలెక్టర్‌గా కూడా పనిచేశారు. ఉద్యోగులు అధికారులు ఆయనను అభినందించారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో స్పార్క్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టర్బేన్స్ డయాగ్నస్టిక్స్‌పై ఇంటర్నేషనల్ వర్క్‌షాప్‌ను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో స్పెయిన్ సీడీఐఎఫ్ డైరెక్టర్, ప్రొఫెసర్ అలెగ్జాండర్, ప్రొఫెసర్లు డేవిడ్, అనూజ్‌కుమార్, నిట్ ప్రొఫెసర్లు శ్రీనివాసరావు, రవికుమార్ పాల్గొన్నారు.
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను వేగంగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో కలిసి నాయిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క–సారక్క జాతరలోగా బ్రిడ్జి పనులు పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్లు ఎండీ అబుబక్కర్, సుంచు అశోక్, పి.ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వివిధ అవసరాల నిమిత్తం ఉచితంగా పరికరాల పంపిణీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, అంధులకు, బధిరులకు బ్యాటరీ వీల్ చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్, హియరింగ్ పరికరాలను అందించేందుకు ఆన్‌లైన్‌లో tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
డీఆర్‌ఓ గణేశ్‌కు ఐఏఎస్ హోదా
డీఆర్‌ఓ గణేశ్‌కు ఐఏఎస్ హోదా


