మద్యం మత్తులోనే ప్రమాదాలు
హసన్‌పర్తి: మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్–అలైవ్’లో భాగంగా భీమారంలోని స్కిల్ స్టోక్ ఇంటర్నేషనల్ పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతేడాది తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కారణంగా 7,500 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రూపొందించిన ‘అరైవ్–అలైవ్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సెంట్రల్ జోన్ డీపీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్ర భాకర్‌రావు, ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లు సీతారెడ్డి, సుజాత, వెంకన్న, శ్రీనివాస్, కేయూసీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, స్కిల్ స్టోక్ పాఠశాల డైరెక్టర్ ఎర్రబెల్లి అనూప్‌కుమార్ పాల్గొన్నారు.
క్రమశిక్షణతో వాహనాలు నడపాలి
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్


