రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు
హసన్‌పర్తి: నగరంలోని 65, 66వ డివిజన్లలో సుమారు రూ.2 కోట్ల విలువైన అభివృద్ధి పనులను బుధవారం మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. 65వ డివిజన్ దేవన్నపేటలో సుమారు రూ.60 లక్షలు, 66వ డివిజన్ హసన్‌పర్తిలో సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రూ.8 లక్షలతో హసన్‌పర్తి పెద్ద చెరువు కట్టపై ఓపెన్ జిమ్ ఏర్పాటుకు బుధవారం పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్, దివ్యరాణి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు.
పెద్ద చెరువుకట్టపై ఓపెన్ జిమ్
ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్


