వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
నర్సంపేట రూరల్: పదో తరగతిలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్‌తేజ అన్నారు. చెన్నారావుపేట మండలంలోని పలు పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలు, టీచింగ్ డైరీలు, తరగతి గదిలో విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధన, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. కార్యక్ర మంలో ఎంఈఓ బైరి సరళ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాపమ్మ, ప్రభాకర్‌రావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్‌తేజ


