ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా బాల్లె రాజుగౌడ్
పర్వతగిరి: ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా వడ్లకొండ ఉపసర్పంచ్ బాల్లె రాజుగౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌అయూబ్ ఆయనకు నియామక పత్రం అందించారు. అనంతరం పర్వతగిరిలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు తదితరులు రాజుగౌడ్‌ను శాలువాలతో సన్మానించి అభినందించారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు డెక్క అనిల్‌కుమార్, వార్డు మెంబర్ వల్లందాస్ రాజు, నాయకులు రావుల బిచ్చయ్య, బైరి సాయిలు, బొంపల్లి స్వామిరావు, తోపుచర్ల వేణురావు, పడిదల ఆనందరావు, జుట్టుకొండ రమే్‌శ, కార్యకర్తలు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: ఉపకరణాల కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన దివ్యాంగులు https:tgobmms .cgg.gov.inలో ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 2024–25 సంవత్సరానికి సంబంధించి 4 బ్యాటరీ వీల్‌చైర్లు, 19 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు, 4 హైబ్రిడ్ వీల్‌చైర్లు, డిగ్రీ విద్యార్థులకు 12 ల్యాప్‌టాప్‌లు, హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు 7 ల్యాప్‌టాప్‌లు, 11 ట్యాబ్స్‌లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.
జాతీయస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు సిద్ధు
పర్వతగిరి: జాతీయస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు పర్వతగిరి మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థి అలువాల సిద్ధు ఎంపికయ్యాడు. తాండూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభకనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీదేవి, పీడీ సురేశ్, ఉపాధ్యాయులు సిద్ధును అభినందించారు.
సాధికారతకు శిక్షణ దోహదం
కాళోజీ సెంటర్: సాధికారత సాధించడానికి శిక్షణ దోహదపడుతుందని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి రాంనివాస్ అన్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు, కేర్ టేకర్లకు శిక్షణ కార్యక్రమం మంగళవారం రెండోరోజూ హనుమకొండ హరిత హోటల్‌లో కొనసాగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని, వృత్తి నైపుణ్యం, సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్ర అసిస్టెంట్ జెండర్ కోఆర్డినేటర్ సతీశ్, మాస్టర్ ట్రెనర్లు కృష్ణవేణి, సరస్వతి, జ్యోతి, వరంగల్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఫ్లోరెన్స్, హన్మకొడ స్పెషల్ ఆఫీసర్ సునీత, జనగామ స్పెషల్ ఆఫీసర్ గౌసియా బేగం పాల్గొన్నారు.
బావిలో అడవి పందులు
సంగెం: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో అడవి పందులు పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గవిచర్ల గ్రామానికి చెందిన గుళ్లపల్లి చక్రపాణి వ్యవసాయ బావిలో 6 అడవిపందులు పడిపోయాయి. బావి చుట్టూ ఓడలు ఉండడంతో అవి బయటకు రాలేకపోయాయి. మంగళవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన చక్రపాణి అడవి పందులను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాధిక ఆధ్వర్యంలో సిబ్బంది జగ్గయ్య, ఖలీల్, శ్రీనివాస్, సమ్మ య్య సిబ్బందితో వచ్చారు. బావి నుంచి అడవి పందులను తీసి బంధించి జీపులో తీసుకెళ్లారు.
ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా బాల్లె రాజుగౌడ్
ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా బాల్లె రాజుగౌడ్
ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా బాల్లె రాజుగౌడ్


