
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
పరకాల: పశువుల సంతలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
పద్మాక్షి గుండం వద్ద బతుకమ్మలతో మహిళల కోలాహలం
వరంగల్ ఆకారపు విశ్వేశ్వర దేవాలయంలో..
వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ..
వేయిస్తంభాల దేవాలయంలో..
బతుకమ్మలతో వస్తున్న ఆడపడుచులు
ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం సద్దుల బతుకమ్మ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులుగా యూరియా బస్తాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మోరె మహేందర్, నాయకులు గుర్రం వేణు, స్వప్న రాజ్‌కుమార్, అరవింద్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, రాజు, నగేశ్, రవి, పోశాలు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పరకాల: పట్టణంలో బతుకమ్మలతో వస్తున్న మహిళలు
సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
ముద్దబంతులు మురిసిపోయాయి. చామంతులు చెమక్కున మెరిశాయి. తంగేడు వనాలు బంగారు వర్ణాలయ్యాయి. అల్లిపూలు అందంగా విరిశాయి. కట్లపూలు, కనకాంబరాలు కనువిందు చేశాయి. సీతజడలు సిగ్గుపడ్డాయి. స్వస్తికాలు సంబురపడగా.. గుమ్మడి పూలు గౌరమ్మగా మారాయి. గునుగు గుభాలించగా.. మహిళల చేతుల్లో పూల శిఖరాలు పురుడుపోసుకున్నాయి. వారంతా చల్లని తల్లిని పాటలతో స్మరిస్తూ.. చప్పట్లతో గొప్పదనాన్ని వర్ణిస్తూ బతుకునివ్వమని వేడుకున్నారు. గౌరమ్మకు పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం పద్మాక్షి దేవాలయ పరిసరాల్లో సద్దుల వేడుకలు వైభవంగా నిర్వహించారు. తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి ఆడపడుచులు ఆడిపాడి సందడి చేశారు.

మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025