
కమిషనరేట్‌లో పోలీస్ అధికారుల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కంట్రోల్ రూం ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డి.విశ్వేశ్వర్ గీసుకొండకు, గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆకునూరి మహేందర్ పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ అయ్యారు. టాస్క్‌ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.వంశీకృష్ణ గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు, సంగెంలో పని చేస్తున్న నరేశ్‌ను మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు, బి.రామారావు సుబేదారి నుంచి జఫర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌నుకు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా (బీఓఎస్)గా ఆవిభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు బీఓఎస్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీఎస్‌ఎల్ సౌజన్య కొనసాగారు. ఆమె పదవీ కాలం పూర్తి కావడంతో మల్లారెడ్డిని నియమించారు. మల్లారెడ్డి రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి బీఓఎస్ ఉత్తర్వులు మల్లారెడ్డికి అందించారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ అండ్ ఇన్‌చార్జ్ విభాగాధిపతిగా దూర విద్యా కేంద్రంలోని డాక్టర్ నల్లాని శ్రీనివాస్‌ను నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విద్యా కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ అండ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈపదవిలో నల్లాని శ్రీనివాస్ ఒక సంవత్సరం పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఉంటారని రిజిస్ట్రార్ ఉత్తర్వులో పేర్కొన్నారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులను నల్లాని శ్రీనివాస్‌కు అందజేశారు.

కమిషనరేట్‌లో పోలీస్ అధికారుల బదిలీ