
పీడీఎం కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా అమృతర
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా రోడ్డ అమృతరావును నియమిస్తూ రాష్ట్ర న్యాయ వ్యవహారాల శాఖ సెక్రెటరీ బి.పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు అమృతరావు ప్రభుత్వ సంబంధిత సివిల్ కేసులు వాదించనున్నట్లు పేర్కొన్నారు. ఈహోదాలో అతను మూడు సంవ్సరాల కాల పరిమితి లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా ఉండనున్నట్లు వివరించారు. ఈసందర్భంగా అమృతరావు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వర్ధన్నపేట అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్‌రావు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ ముదాసిర్ ఖయ్యూం, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.