కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు | - | Sakshi
Sakshi News home page

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు

Aug 3 2025 2:50 AM | Updated on Aug 3 2025 2:50 AM

కష్టస

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు

స్నేహితం.. సేవే అభిమతం

తొర్రూరు: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఆపదలో స్నేహితులకు ఆర్థిక చేయూతనిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుడు చాట్ల సంపత్‌ను బతికించాలని రూ.1.3 లక్షలు సమీకరించి చికిత్స అందించారు. అదేవిధంగా కంఠాయపాలెం గ్రామానికి చెందిన ఆర్‌ఎన్‌ చారి అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోగా.. గుర్తించిన మిత్రులు రూ.50 వేలు జమ చేసి అందించారు. పదో తరగతి మిత్రుడు నాగేశ్వరరావు ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తుండగా.. బస్సు ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. ఆరు నెలలు డ్యూటీ లేకుండా ఇంట్లోనే ఉండడంతో అతడి కూతురు చదువుకు ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మేమున్నామంటూ సహచర పదో తరగతి మిత్రులు రూ.70 వేలు అందించారు.

ఆర్థికంగా ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు

ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా దోస్తులు

నేడు ఫ్రెండ్‌షిప్‌ డే

లింగభేదాలకు అతీతం.. కులమతాలకు వ్యతిరేకం.. కష్టాల్లో గుండె నిబ్బరం. రంగుల కలలను రంగరించే ప్రత్యేక లోకం. అదే స్నేహ బంధం

దృగంతాలను చుట్టి రావాలన్నా.. అంబరాన్ని అందుకోవాలన్నా..

సందర్భమేదైనా జిందగీలో దోస్తానా అనేది ఉంటే.. దిల్‌.. జిగేల్‌ అనాల్సిందే! అలాంటి స్నేహ మాధుర్యానికి నేడు (ఆదివారం) స్నేహితుల దినోత్సవం

సందర్భంగా ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది.

ప్రతిరోజూ మాట్లాడుకుంటాం..

నర్సంపేట: వృత్తి రీత్యా ఒకరు పోలీసు శాఖలో సీఐ,మరొకరు ఉపాధ్యాయుడు. 30 సంవత్సరాల క్రితం డిగ్రీ చదివే సమయంలో పరి చయమయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఒకే కుటుంబంలాగా కలిసి ఉంటున్నారు. కష్టాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు వారే నర్సంపేటకు చెందిన సీఐ రఘు, ఖానాపురానికి చెందిన ఉపాధ్యాయుడు కుమార్‌. స్నేహితుల దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజు ఫోన్‌లో మాట్లాడుకుంటామని, వేర్వేరు వృత్తుల్లో ఉన్నా కలిసి ఉంటామన్నారు.

ఆడపిల్లలకు ఆర్థిక చేయూత

ఖానాపురం: మండల కేంద్రంలోని హైస్కూల్‌లో 1996–97లో విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరంతా మూడేళ్ల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్న సమయంలో వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. వీరితో పాటే 6 నుంచి 9వ తరగతి చదివిన వారిని సైతం ఇదే గ్రూప్‌లో యాడ్‌ చేసుకున్నారు. ప్రస్తుతం సుమారు 50 మందితో గ్రూప్‌ సాగుతోంది. గ్రూపులో ఎవరికి ఏ కష్టమొచ్చినా తామున్నామనే భరోసాను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు 14 మంది స్నేహితుల కుమార్తెలకు ఆర్థిక చేయూతనందించారు. వివాహ సమయాల్లో ఒక చోట కలిసి ఆనందంగా గడుపుతున్నారు.

స్నేహితుల సంఘం!

గీసుకొండ: గ్రేటర్‌ వరంగల్‌లోని 16వ డివిజన్‌ ధర్మారంలోని కోట మెసమ్మ తల్లి పరపతి సంఘం (స్నేహితుల సంఘం) ఆదర్శంగా నిలుస్తోంది. 2014 ఆగస్టు 15న తొమ్మిది మంది స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 24 మంది సభ్యులున్నారు. రూ. 50 లక్షల టర్నోవర్‌తో సంఘం లావాదేవీలు నిర్వహిస్తోంది. అవసరం ఉన్నసభ్యులకు 0.5 వడ్డీతో రుణాలిస్తున్నారు. సంఘ సభ్యులెవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.లక్ష సాయం అందిస్తున్నారు. ఏటా ఫ్రెండ్‌ షిప్‌ డే రోజున సంఘ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. కోటమైసమ్మ తల్లికి గొర్రెలను బలిచ్చి విందు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు
1
1/6

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు
2
2/6

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు
3
3/6

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు
4
4/6

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు
5
5/6

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు
6
6/6

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement