
దశల వారీగా కాల్వల్లో పూడికతీత
రాయపర్తి: రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు. తిర్మలాయపల్లి గ్రామ పరిధిలోని డీబీఎం–55 కెనాల్‌లో రూ.8లక్షలతో పూడికతీత పనులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులు పూర్తయిన తర్వాత రాయపర్తి, తిర్మలాయపల్లి పరిధిలోని సుమారు 500 ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. దశలవారీగా నియోజకవర్గంలోని అన్ని కాల్వల్లో పూడికతీత పనులు చేపడతామని చెప్పారు. ఎస్సారెస్పీ కాల్వగట్టు బురద, గుంతలమయంగా ఉండడంతో ఎమ్మెల్యే అధికారులతో కలిసి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌పై వెళ్లి పనులు ప్రారంభించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ చంద్రమోహన్, ఇరిగేషన్ అధికారులు బాలదాసు తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి