
ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీ లెక్కింపు
● రూ.40.73 లక్షల ఆదాయం
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయశాఖ పరిశీలకులు డి.అనిల్ కుమార్ పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. గత మే 6నుంచి ఈ నెల 2వ తేదీ వరకు హుండీల్లో రూ.6,53,015, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.34,20,073 రాగా, మొత్తం రూ.40,73,088ల నగదు సమకూరినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యధావిధిగా హుండీలోనే వేసి సీల్ చేశామన్నారు. లెక్కింపులో కానిస్టేబుళ్లు శ్రీనివాస్, జి.పరమేశ్వరి, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
ఇంటర్.. భవిష్యత్‌కు మార్గనిర్దేశం
రామన్నపేట: ఇంటర్మీడియట్ విద్య.. భవిష్యత్‌కు మార్గనిర్దేశమని జూనియర్ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ పూజ పేర్కొన్నారు. వరంగల్ కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ పూజ మాట్లాడుతూ విద్యార్థి దశలో సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్‌లకు స్పందించవద్దని సూచించారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు వనమాల, ప్రవళిక పాల్గొన్నారు.