
ధర్మసాగర్(వేలేరు): సమయాన్ని సద్వినియో గం చేసుకుంటే ఏరంగంలోనైనా రాణించవచ్చ ని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉత్సవ కమిటీ, విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువబోతున్న విద్యార్థులకు నెల రోజుల ఉచిత వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం సెలవుల ను సద్వినియోగం చేసుకుంటే విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు. వేలేరు అంబేడ్కర్ ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఉచిత శిక్షణ తరగతుల ఉపాధ్యాయులు బొల్లం రాజు, మొగిలిచర్ల శ్రీనివాస్, రుద్రోజు రాజు, సర్పంచ్ కాయిత మాదవరెడ్డి, ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ తదితరుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
సీఎం కప్‌లో పతకాల పంట
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ ప్రభుత్వం మే నెల 28 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో హనుమకొండ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. ఆతిథ్య హైదరాబాద్ జట్టుతో తలపడిన హనుమకొండ జిల్లా పురుషుల జట్టు 19–18 గోల్స్ తేడాతో గెలిచి రన్నరప్‌గా నిలిచింది. ‘శాట్’ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, ‘శాట్’ వీసీ ఎండీ కె.లక్ష్మి చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ అందుకున్నారు. కార్యక్రమంలో ‘శాట్’ డీడీ ధనలక్ష్మి, ఏఓ సుజాత, ఒలింపిక్ సంఘం రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్, హనుమకొండ డీఎస్‌ఏ కోచ్ బొడ్డు విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
బ్యాడ్మింటన్ పోటీల్లో..
రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో హనుమకొండ జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. మహిళల సింగిల్స్‌లో కీర్తి కాంస్య పత కం, డబుల్స్‌లో కీర్తి, నిఖితరావు బంగారు పత కం, పురుషుల డబుల్స్‌లో అనీష్, శౌర్యకిరణ్ వెండి పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులతోపాటు కోచ్ రమేష్‌ను డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్ అభినందించారు.
