ఓటర్లుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

Oct 5 2026 12:09 AM | Updated on Oct 5 2026 12:09 AM

వనపర్తి రూరల్‌: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీరంగాపురంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత ఓటర్లతో పాటు కొత్తగా ఓటు హక్కు పొందేందుకు నవంబర్‌ 6వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. అర్హులైన పట్టభద్రులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ఓ ఇన్‌చార్జిని నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది రాజు, ఎన్నికల ఇన్‌చార్జి బాశెట్టి శ్రీనివాసులు, వినోద్‌ సాగర్‌, మండల ఇన్‌చార్జి కంచె ఆంజనేయులు, రాజశేఖర్‌, రఘు, లక్ష్మీకాంత్‌రెడ్డి, అరవిందు, కావలి రాము, గుంటి శివ, చరణ్‌నాయుడు, తోట రవి ఉన్నారు.

రేపు రగ్బీ, తైక్వాండో

క్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఈనెల 6వ తేదీన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–14, 17, 19 విభాగాల ఉమ్మడి జిల్లాస్థాయి రగ్బీ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా వివరాల కోసం పీడీ నర్సింలును సంప్రదించాలని కోరారు.

● జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం (6వ తేదీ) స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–14, 17 విభాగాల బాలబాలికల జిల్లాస్థాయి తైక్వాండో ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

● 2021లో సీ్త్రనిధి రుణం రూ.25లక్షలతో కొనుగోలు

● నిర్వహణ లేక నిరుపయోగంగా ట్రాక్టర్‌, వరినాటు మిషిన్లు

● శిథిలావస్థకు చేరిన అధునిక పరికరాలు – ఖిల్లాఘనపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement