వైభవంగా రాములోరి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రాములోరి కల్యాణం

Oct 5 2026 12:09 AM | Updated on Oct 5 2026 12:09 AM

ఎర్రవల్లి: పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను అపురూపంగా ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణాన్ని జరిపారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అదిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు కలుకుంట్లకు చెందిన ఆంజనేయులుగౌడ్‌ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement