దవాచాయ్ తాగడం శరీరానికి చాలా మంచిది. గ్యాస్, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రోజుకు కనీసం ఒక్క టీ గ్లాస్ దవాచాయ్ తాగుతాను. గత కొన్ని రోజులుగా నేను దవాచాయ్ తాగుతున్నాను. నాకు తెలిసిన మిత్రులకు, గ్యాస్ సమస్య ఉన్నవారికి అలవాటు చేశాను. సుమారు 24 వనమూలికల సమ్మిళితంతో తయారు చేస్తున్నారు. పాలు, చక్కెర, టీ పొడిలతో తయారు చేసిన చాయ్‌ను తగ్గించాం.
– సుధీర్‌రెడ్డి, డీవైఎస్‌ఓ, వనపర్తి
కెఫిన్.. ప్రమాదకరమైనది
రెగ్యులర్‌గా తీసుకునే టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. సాధారణ టీలో 60 శాతం, గ్రీన్‌టీలో 50 శాతం ఉంటుంది. దీంతోపాటు కాఫీ, టీ పొడి, పాలు, చక్కెర సైతం కల్తీ అవుతున్నాయి. కల్తీ అయినవి ఎందుకు అని దవాచాయ్ తీసుకుంటున్నాం. సహజసిద్ధంగా సేంద్రియ పద్ధతిలో పెంచిన వన మూలికల చూర్ణం నీటిలో మరిగిస్తే దవాచాయ్ తయారవుతుంది.
– శ్రీకాంత్, ఉద్యోగి, వనపర్తి
గ్రీన్ జ్యూస్‌లతో ఆరోగ్యం
ఇక్కడ లభించే పలు రకాల గ్రీన్ జ్యూస్‌లతో చాలా ఆరోగ్యం. సేంద్రియ ఎరువులతో పండించిన గుమ్మడి, సోరకాయ, దొండ, కాకర, ఇతర కూరగాయలను జ్యూస్‌గా చేసి ఇస్తున్నారు. ఇంట్లో ఇలాంటివి చేసుకోవడం సాధ్యం కాదు. టీ, కాఫీలకు బదులు ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక గ్రీన్ జ్యూస్ తాగుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాం.
– రాంరెడ్డి, వనపర్తి
●


