పోలీస్‌స్టేషన్ స్థలాన్ని పరిశీలించిన ఐజీ
అమరచింత: మండల కేంద్రంలోని దుంపాయికుంటలో పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఐజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రమేష్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్థలానికి సంబంధించిన పత్రాలను చూశారు. ప్రస్తుతం టెలిఫోన్ ఎక్స్ఛేంజీ భవనంలో కొనసాగుతుందని ఎస్‌ఐ స్వాతి ఐజీ దృష్టికి తీసుకొచ్చారు. భవన నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యేలా తనవంతు కృషి చేస్తామన్నారు. అనంతరం పీజేపీ నందిమళ్ల క్యాంపు కాలనీలో నిర్మిస్తున్న పోలీస్ ఔట్‌పోస్టు పనులను పరిశీలించారు.
నేడు అప్రెంటీస్‌షిప్ మేళా
వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట శివారులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం అప్రెంటీస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమేష్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మే ళాను సద్వినియోగం చేసుకోవాలని.. నిజ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.
వరికి గిట్టుబాటు ధర
కల్పించాలి
కొత్తకోట: రైతులు ఆరుగాలం కష్టపడి పండించే వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వరాచారి, సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోడ్లపై ఆరబోసి ఐదు రోజులైనా కాంటాలు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కొందరు మిల్లర్లు రైతుల దగ్గర నుంచి తరుగు తీస్తామని చెబుతున్నారని, కొన్న ధాన్యానికి కచ్చితంగా పట్టి ఇవ్వాలని, నష్టం కలగకుండా చూడాలన్నారు. గతంలో ప్రభుత్వం కొన్న సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ నేటి వరకు రైతుల ఖాతాలో జమ చేయలేదని, జిల్లాలోని 18 వేల మంది రైతులకు రూ.48 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తక్షణమే విడుదల చేయకుంటే పెద్దఎత్తున రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, హమాలీలు నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహ, వెంకటయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ స్థలాన్ని పరిశీలించిన ఐజీ


