
నిబంధనల మేరకే తనిఖీలు
వనపర్తి: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును ప్రతినెలా తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వెనుక ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉందని వివరించారు. ఆయన వెంట వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
నామినేషన్ స్వీకరణ కేంద్రాల పరిశీలన..
వనపర్తి ఎంపీడీఓ కార్యాలయం, చిట్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను గురువారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, ఆద ర్శ్ సురభి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు
వనపర్తి రూరల్: పెబ్బేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ ఆర్వో కేంద్రాన్ని గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీపీఓ రఘునాథ్‌రెడ్డి తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ రోజారెడ్డి తదితరులు ఉన్నారు.

నిబంధనల మేరకే తనిఖీలు