
దేశ ఉన్నతిలో యువత పాత్ర కీలకం
ఖిల్లాఘనపురం: యువత పంచ పరివర్తన నియమాలు పాటిస్తూ దేశ ఉన్నతికి తోడ్పడాలని ఆర్‌ఎస్‌ఎస్ జోగుళాంబ గద్వాల జిల్లా సహ పరివాహ యుగంధర్‌జీ అన్నారు. రారష్ట్‌రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శనివారం మండల కేంద్రంలో శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు. పట్టణ వీధుల్లో పద సంచాలన చేసిన అనంతరం పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్వదేశి, సౌర నియమాలు, కుటుంబ ప్రబోధన అనే పంచ పరివర్థన నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. దేశంలోని యువతలో దేశభక్తి పెంపొందించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తోందని తెలిపారు. సంఘం ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్నందున పూర్వ స్వయం సేవకులను మరోమారు చైతన్యం చేస్తున్నామని.. దేశంపై భక్తిభావం కలిగి ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. పద సంచాలన్ సమయంలో వీధుల్లో పలువురు ప్రజలు స్వయం సేవకులపై పూలు చల్లారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల స్వయం సేవకులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. మండల స్వయం సేవకులు విక్రం, బుచ్చిబాబుగౌడ్, వేణు, సాయినాథ్, గోపాల్ ముదిరాజ్, అశోక్‌గౌడ్, భాస్కర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో స్వయం సేవకులు