
స్పందన కరువు..!
ఇవీ నిబంధనలు..
రెండో శనివారం దరఖాస్తుల స్వీకరణ..
ఒకేరోజు 18 దరఖాస్తులు..
మద్యం టెండర్లకు ఆసక్తి చూపని వ్యాపారులు
●
పదిహేను రోజుల్లో కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. చివరి రోజుల్లో దరఖాస్తుల సంఖ్య ఆశించిన మేర పెరగొచ్చు. శనివారం మంచిరోజు ఉన్నందున రాష్ట్రస్థాయి అధికారులు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. సులభతరమైన సింగిల్ పేజీ దరఖాస్తు పత్రాన్ని పూరించి డీడీతో పాటు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలోపు కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులన్నింటినీ స్వీకరిస్తాం.
– శ్రీనివాస్, ఈఎస్, వనపర్తి
వనపర్తి: నూతన ఎకై ్సజ్ పాలసీతో ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం చేసిన ప్రయత్నం అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్న చందంగా మారిందనే వాదనలు విపిస్తున్నాయి. రెండేళ్ల కాలపరిమితితో మద్యం విక్రయాలకు లక్కీడిప్ పద్ధతిన దుకాణాల కేటాయింపు, లక్కీడిప్‌లో పాల్గొనేందుకు దరఖాస్తుతో పాటు తిరిగి చెల్లించని రూ.2 లక్షల డీడీని జత చేయాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచడం, రియల్ వ్యాపారం కుదేలవడం తదితర కారణాలతో దరఖాస్తుల దాఖలుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఇదివరకు మద్యం దుకాణాలు నిర్వహించిన వారు మాత్రమే మరోమారు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై 15 రోజులు కావస్తుండగా.. శుక్రవారం సాయంత్రం వరకు కొత్తకోటలోని దుకాణం నంబర్ 27, 30కి ఒక్కో దరఖాస్తు మాత్రమే దాఖలు కావడం గమనార్హం. ఇటీవల ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి జిల్లాలో పర్యటించి దరఖాస్తుల పెంపునకు వ్యాపారులను ఆకర్షించే పద్ధతులపై ఈఎస్, ముగ్గురు ఎస్‌హెచ్‌ఓలు, ఇతర సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. జిల్లాలోని మొత్తం 36 దుకాణాల్లో మద్యం విక్రయాలు, వ్యాపారులకు దక్కిన లాభాలు, ప్రభుత్వానికి జమ చేసిన మొత్తం తదితర వివరాలను జిల్లా ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో ప్రదర్శించారు.
రూ.26.82 కోట్ల ఆదాయం..
2025, నవంబర్ 30తో ముగియనున్న గత మద్యం పాలసీతో జిల్లా నుంచి దరఖాస్తుల రూపేణా.. జిల్లా తరుఫున ప్రభుత్వానికి రూ.26.82 కోట్ల ఆదాయం సమకూరింది. అధికారుల లెక్కల ప్రకారం.. 1,341 దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల తిరిగి చెల్లించని డబ్బులు ప్రభుత్వానికి అందాయి. కానీ ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా.. గడువులోగా వస్తాయనే ధీమాలో ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు.
జిల్లాలో 36 దుకాణాలు
15 రోజుల్లో కేవలం
రెండు దరఖాస్తులు దాఖలు
ముహూర్తం కోసం ఎదురుచూపులు
దరఖాస్తు ఫీజు రూ.లక్ష పెంచడం, రియల్ వ్యాపారం పడిపోవడమే
కారణమా..?
స్థానిక ఎన్నికల వాయిదాతో
మరింత డీలా
ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు సమర్పించాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. జిల్లాలో ప్రస్తుతం 36 మద్యం దుకాణాలు రూ.55 లక్షలు, రూ.60 లక్షల స్లాబ్‌లో ఉన్నాయి.
ఏడాదిలో ఆరుసార్లు వార్షిక లక్ష్యాన్ని చేరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆర్డినరీ మద్యంపై 27 శాతం, ప్రీమియం, బీర్లపై 20 శాతం మార్జిన్ చెల్లింపులు ఉంటాయి.
దరఖాస్తులు సమర్పించేందుకు శనివారం మంచిరోజు ఉందనే కారణంతో ఉన్నతాధికారులు సెలవు దినమైన రెండో శనివారం కూడా జిల్లా ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించేలా ఉత్తర్వులు జారీ చేశారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నాటి నుంచి శుక్రవారం వరకు 15 రోజుల్లో రెండు దరఖాస్తులు రాగా.. శనివారం మంచిరోజుగా భావించిన మద్యం వ్యాపారులు ఒకేరోజు 18 దరఖాస్తులు జిల్లా ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో అందజేసినట్లు ఈఎస్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 36 దుకాణాలుండగా.. ఇప్పటి వరకు 11 దుకాణాలకుగాను 20 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. మరో 25 దుకాణాలకు ఇప్పటి వరకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 వరకు అవకాశం ఉంది.

స్పందన కరువు..!