
ఆధునిక హంగులు
సమర్థ్ పోర్టల్‌తో సేవలు..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఆటుపోట్లను దాటుకుంటూ.. ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ వినూత్నంగా ముందుకెళ్తోంది. ప్రస్తుత వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పీయూలో పరిపాలన కొత్త పుంతలు తొక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమర్థ్ స్కీం పోర్టల్ ద్వారా సిబ్బందికి ఆన్‌లైన్ అటెండెన్స్, వర్క్‌లోడ్, పే స్లిప్‌ల వంటివి అందిస్తున్నారు. వీటితోపాటు పీయూలో వినియోగిస్తున్న నీటి పునర్వినియోగం కోసం నూతనంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ భవనంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఆదా చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో తమవంతు భాగస్వామ్యం అవుతున్నారు.
కీలకంగా సీవేజ్ ప్లాంట్..
యూనివర్సిటీలో గత కొన్నేళ్లుగా తీసుకువస్తున్న మార్పుల్లో కీలకమైంది సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. రూ.5 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ కిందభాగంలో దీనిని నిర్మిస్తున్నారు. యూనివర్సిటీలో పలు హాస్టల్స్, కళాశాలలు నుంచి వచ్చే డ్రెయినేజీ నీటిని ఇక్కడ ఉండే పెద్ద మూడు ట్యాంకుల్లోకి మళ్లించి నీటితోపాటు ఇతర వ్యర్థాలను శుద్ధి చేసే విధంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేస్తుంది. ఇందులో శుద్ధి చేసిన నీటిని తిరిగి చెట్లు, తోటలు, గార్డెన్లకు, ఘన పదార్థాల వ్యర్థాలను బయో ఫర్టిలైజర్‌గా వినియోగిస్తున్నారు. చెట్లకు ఇతర అవసరాల కోసం ఎరువులుగా ఉపయోగించనున్నారు. దీని ద్వారా పీయూ వ్యర్థాల పునర్వినియోగంలో టాప్‌లో నిలువస్తుంది. న్యాక్ ర్యాంకింగ్‌లో మెరుగైన స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది.
విద్యుత్ ఆదా..
యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో సోలార్ విద్యుత్ వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రూ.3 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ భవనం పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించారు. వీటి ద్వారా యూనివర్సిటీలోని పలు విభాగాలకు సోలార్ విద్యుత్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. ప్రస్తుతం ఇది ప్రభుత్వం అందించే సాధారణ విద్యుత్‌తో కలుపుకొని అన్ని విభాగాలకు అందిస్తున్నారు. దీని ద్వారా యూనివర్సిటీకి తక్కువ కరెంట్ బిల్లు వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కొన్ని విభాగాలకు సరిపోవడం లేదని, దీనిని పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు పేర్కొంటున్నారు.
ఆన్‌లైన్ విధానంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థుల వివరాలు
విద్యుదుత్పత్తి కోసం
సోలార్ ప్యానెల్స్ బిగింపు
రూ.5 కోట్లతో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు
నీటి పునర్వినియోగం, వ్యర్థాలతో బయో ఫర్టిలైజర్స్ తయారీ
పీయూలో టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి సెలవుల మంజూరు, వేతనాల పే స్లిప్‌లు, విద్యార్థి అడ్మిషన్, అటెండెన్స్, స్కిల్స్ తదితర అంశాలను పొందుపర్చుకోవడం, వివిధ కార్యక్రమాలు, హాస్పిటల్స్ తదితర అంశాలను మ్యానువల్ పద్ధతిలో జరిగేవి. దీనిని ఆన్‌లైన్ విధానంలోకి తీసుకొచ్చి సమగ్రంగా యూనివర్సిటీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పీఎం ఉషా స్కీం నిధులను అందిస్తున్న ప్రతి ప్రభుత్వ విద్యా సంస్థకు కేంద్రం సమర్థ్ పోర్టల్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ స్కీంలో భాగంగా యూనివర్సిటీ సిబ్బందికి ప్రత్యేకంగా సమర్థ్ యాప్ ద్వారా ప్రత్యేక సేవలను అందించేందుకు అధికారులు ఇటీవల ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో రెగ్యులర్ అధ్యాపకులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయగా.. కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలను ఈ పోర్టల్ దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అనంతరం నాన్‌టీచింగ్ సిబ్బంది, విద్యార్థులనూ ఇందులో చేర్చనున్నారు. తద్వారా పీయూకు సంబంధించిన ప్రతి ఫైల్ కూడా ఈ–పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫైలింగ్ నిర్వహించి.. ఫైల్ స్టేటస్ ఎక్కడ.. ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

ఆధునిక హంగులు

ఆధునిక హంగులు