
టాప్‌లో నిలబెడతాం..
పీయూనూ తెలంగాణలో టాప్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. ఫైల్స్, సిబ్బంది అటెండెన్స్, విద్యార్థుల తదితర వివరాలు అన్ని సమర్థ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తున్నాం. డ్రెయినేజీ నీరు వృథా పోకుండా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి.. నీటి పుర్వినియోగం, బయో ఫర్టిలైజర్స్ వినియోగంలోకి తీసుకువస్తాం. సోలార్ ప్యానెల్స్ ద్వారా కరెంట్ బిల్లు ఆదా అవుతుంది.
– జీఎన్ శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్‌లర్
యూనివర్సిటీలో పేపర్ లెస్ సేవలు నిర్వహించేందుకు సమర్థ్ పోర్టల్‌ను వినియోగిస్తున్నాం. దీని ద్వారా టీచింగ్, నాన్‌టీచింగ్, స్టూడెంట్స్ అందరికీ కూడా సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు ఈ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది. వీలైనంత త్వరగా దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తాం. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌తో యూనివర్సిటీలో నీటి కొరత తీరడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. – రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్