
వ్యాపారులను ఆకర్షించేదెలా?
● ఉద్యోగులతో ఎకై ్సజ్ డిప్యూటీ
కమిషనర్ సమీక్ష
వనపర్తి: మద్యం టెండర్ల స్వీకరణ ప్రక్రియను ఎకై ్సజ్‌శాఖ జిల్లాల వారీగా ప్రారంభించిన విషయం పాఠకులకు విధితమే. రెండువారాలు గడిచినా జిల్లాలోని 36 దుకాణాలకు మంగళవారం వరకు కనీసం ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. బుధవారం ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్‌శాఖ డిప్యూటి కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు. ఈఎస్ శ్రీనివాస్‌తో పాటు ముగ్గురు ఎస్‌హెచ్‌ఓలు, ఇతర సిబ్బందితో సుమారు గంటపాటు సమీక్ష నిర్వహించారు. మరో పదిరోజుల్లో గడువు ముగియనుందని.. ప్రస్తుత మద్యం వ్యాపారులతో మాట్లాడి టెండర్లు దాఖలు చేయించే ప్రయత్నం చేయాలని సూచించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొత్త పాలసీ వచ్చే వరకు పూర్తవుతున్నందున వ్యాపారులు రింగై కొద్దిపాటి టెండర్లు దాఖలు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచే ప్రయత్నంలో భాగంగా మద్యం వ్యాపారంలోకి కొత్తవారిని ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
బుధవారం రెండు దరఖాస్తులు..
రెండువారాల తర్వాత బుధవారం ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో కొత్తకోటలోని ఎస్సీ కేటగిరికి రిజర్వ్ చేసిన దుకాణం–27కు ఒకటి, జనరల్‌కు రిజర్వ్ చేసిన దుకాణం–30కి ఒకటి ఒకేరోజు మొత్తంగా రెండు టెండర్లు దాఖలైనట్లు ఈఎస్ శ్రీనివాస్ వివరించారు.