విజ్ఞాన కౌశలం వెలికి తీసేందుకే... | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన కౌశలం వెలికి తీసేందుకే...

Oct 5 2026 12:57 AM | Updated on Oct 5 2026 12:57 AM

విజ్ఞాన కౌశలం వెలికి తీసేందుకే...

● 8, 9, 10 తరగతుల విద్యార్థులకు కౌశల్‌ పోటీలు

● ఈ నెల 20 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం

పాలకొండ రూరల్‌: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కౌశల్‌ సైన్స్‌ క్విజ్‌తో పాటు పోస్టర్‌ పోటీలను భారతీయ విజ్ఞాన మండలి (బీవీఎం), ఏపీ శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్తంగా నిర్వహించనుంది. ఈ పోటీలకు 8 నుంచి 10వ తరగతుల విద్యార్థులు అర్హులు. మూడు దశల్లో విద్యార్థులు ఈ పోటీల్లో తమ ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలతో పాటు ప్రశంసాపత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఒక్కో తరగతి నుంచి కనిష్టంగా 10 మంది, గరిష్టంగా 30 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఎంపికై న వారు తమ వివరాలను పాఠశాల ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్ల ద్వారా కౌశల్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అక్టోబర్‌ వరకు బోధించిన పాఠ్యాంశాల ఆధారంగా విజ్ఞాన శాస్త్రం, గణితం, భూగోళ శాస్త్రం, భారతదర్శనం, శాస్త్ర విజ్ఞానరంగంలో భారతీయుల కృషి, తదితర అంశాలపై క్విజ్‌ ప్రశ్నలు ఉంటాయి. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ‘హరత ఇంధన వనరులు – సుస్థిర భవిష్యత్‌’ అంశంపై.. 9వ తరగతి విద్యార్థులకు బాధ్యతాయుత కృత్రిమ మేధస్సు నైతికత అంశంపై.. 10 వ తరగతి విద్యార్థులకు డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు జీవితం– పరిశోధనలపై పోస్టర్‌, రీల్స్‌ పోటీలు నిర్వహిస్తారని జిల్లా సైన్స్‌ అధికారి గిరడ లక్ష్మణరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement