వర్తమాన సాహిత్యంలో కళింగాంధ్ర పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

వర్తమాన సాహిత్యంలో కళింగాంధ్ర పాత్ర కీలకం

Oct 5 2026 12:57 AM | Updated on Oct 5 2026 12:57 AM

వర్తమాన సాహిత్యంలో కళింగాంధ్ర పాత్ర కీలకం

● కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు

చింతకింది శ్రీనివాసరావు

విజయనగరం క్రైమ్‌: వర్తమాన సాహిత్యంలో కళింగాంధ్ర పాత్ర కీలకమని, ఇక్కడ కవులు పేదల బతుకులను వ్యంగ్యంతో రంగరించారని కేంద్ర సాహిత్య అకాడమీ, తెలుగు సలహా మండలి సభ్యుడు డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావు అన్నారు. స్థానిక గురజాడ కేంద్ర గ్రంథాలయం చా.సో వేదికపై కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కళింగాంధ్ర వర్తమాన సాహిత్యం అన్న అంశంపై ఆదివారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి రాజుల కాలంలో విజయనగరం, బొబ్బిలి సంస్థానాలలో నిరుపేదలు సైనికులుగా తమ జీవితాలను ధార పోశారన్నారు. వాళ్లల్లో దాగి ఉన్న హాస్యం, చెమటోడ్చిన వైనాన్ని పలువురు కవులు తమ, తమ భాషా ప్రయోగంతో రచనలు చేశారని చెప్పారు. చా.సో, గురజాడ, గొల్లపూడి ఇలా ఎందరో కవులు అభ్యుదయ భావాలతో సమకాలీన వర్తమాన స్థితిగతులతో కవిత్వాలను ఽఆధునిక సమాజానికి అందించారరని గుర్తు చేశారు. ప్రముఖ తెలుగు విమర్శకులు రామసూరి సీతారామయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆజ్యం పోసిందే కళింగ ప్రాంతమన్నారు. తెలంగాణ విముక్తి పోరాటం నిజాం నవాబుల కాలం నాటిదని.. ఇక్కడి శ్రీకాకుళంలోని రైతాంగ పోరాటం ఈ నాటిది కాదని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రేరణే కళింగాంధ్ర పోరాటమని చెప్పారు. మహాకవి గురజాడ కొత్త తరహా సాహిత్యాన్ని ప్రపంచానికి అందించారని.. ఆ బాటలోనే శ్రీశ్రీ, చా.సో, ఆరుద్ర వంటి వారున్నారని తెలిపారు. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి షణ్ముఖానంద, సాహితీవేత్త నారాయణ వేణు, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు జీఎస్‌ చలం, జిల్లాకు చెందిన సాహితీ అభిమానులు, కవులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement