రాష్ట్రస్థాయి పోటీల్లో గుమ్మలక్ష్మీపురం విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో గుమ్మలక్ష్మీపురం విద్యార్థుల ప్రతిభ

Oct 5 2026 12:57 AM | Updated on Oct 5 2026 12:57 AM

రాష్ట్రస్థాయి పోటీల్లో గుమ్మలక్ష్మీపురం విద్యార్థుల ప్రతిభ

గుమ్మలక్ష్మీపురం: కర్నూల్‌ జిల్లా ఆధోనిలో ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో గుమ్మలక్ష్మీపురం మండలంనకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి, 16 పతకాలను సాధించినట్లు పీడీ పత్తిక చంద్రమోహన్‌ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ మేరకు బాలికల అండర్‌ –16 విభాగంలో బి.రోజంతి జావిలన్‌ త్రోలో ద్వితీయ స్థానం.. బి.ప్రశాంతి 60 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానం సాధించిందన్నారు. అలాగే అండర్‌–18 విభాగం జావిలన్‌ త్రోలో వి.సుమిత్ర ద్వితీయ స్థానం.. బి.సుశీల తృతీయ స్థానం.. లాంగ్‌జంప్‌లో ఎ. దివ్య మూడో స్థానంలో నిలిచారని తెలిపారు. అండర్‌ – 20 విభాగంలో సీహెచ్‌.ప్రశాంతి లాంగ్‌జంప్‌లో రెండో స్థానం.. బి.స్పందన 800 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం, 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం పొందిందన్నారు. అలాగే బాలుర అండర్‌– 16 విభాగంలో కె.రంజిత్‌ లాంగ్‌ జంప్‌లో మూడో స్థానం.. అండర్‌– 18 విభాగంలో పి.హేమంత్‌ జావిలన్‌ త్రోలో ద్వితీయ స్థానం.. యూ.హర్షవర్థన్‌ రేష్‌ వాక్‌లో మూడో స్థానం.. అండర్‌– 20 విభాగం రేష్‌ వాక్‌లో బి.హరీష్‌ మొదటి స్థానం.. సీహెచ్‌ రాజేష్‌ 800 మీటర్ల పరుగులో మూడో స్థానం.. ఎం.అజయ్‌ 3000 మీటర్ల పరుగులో మూడో స్థానం.. బి.గణేష్‌ డిస్క్‌ త్రోలో రెండో స్థానంలో నిలిచాడన్నారు. ఈ పోటీల్లో గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన క్రీడాకారులు 3 గోల్డ్‌ మెడల్స్‌, 7 సిల్వర్‌ మెడల్స్‌, 6 బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement