స్కూల్‌ గేమ్స్‌ జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ గేమ్స్‌ జిల్లా జట్ల ఎంపిక

Oct 4 2026 5:29 PM | Updated on Oct 4 2026 5:29 PM

విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నగర శివారుల్లో గల విజ్జీ స్టేడియం ప్రాంగణంలో శనివారం ఫుట్‌బాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాంశాల్లో అండర్‌ – 14, 17, 19 వయస్సుల విభాగాల్లో ఎంపికలు నిర్వహించగా.. ఉమ్మడి విజయనగరం నుంచి సుమారు 300 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయటం జరిగిందని జిల్లా ఫెడరేషన్‌ కార్యదర్శులు ఆర్‌.వాణిశ్రీ, బైరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ ఎంపిక పోటీలను ఆయా క్రీడా అసోసియేషన్‌లతో పాటు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.

అగ్నిమాపక కేంద్రం పరిశీలన

పాలకొండ: స్థానిక అగ్నిమాపక కార్యాలయాన్ని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పంగ సింహచలం శనివారం పరిశీలించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన కేంద్రంలో ఉన్న పరికరాలు, వాహనాలు, పంపులు పని చేస్తున్న తీరు పరిశీలించారు. అత్యవసర సమయాల్లో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఇటీవల వరదల సమయంలో అగ్నిమాపక అధికారి, సిబ్బంది చేపట్టిన సహయక చర్యలను అభినందించారు. అనంతరం ఆయన సిబ్బందికి దోమ తెరలను పంపిణీ చేశారు. ఆయనతో పాటు స్థానిక అగ్నిమాపక శాఖ అధికారి జామి సర్వేశ్వరరావు ఉన్నారు.

పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలి : డీఈఓ

విజయనగరం అర్బన్‌: జాతీయ స్థాయి స్మైల్‌ రోల్‌ ప్లే, జానపద నృత్య పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలని డీఈఓ యు.మాణిక్యం నాయుడు, డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రామకృష్ణారావు సూచించారు. డైట్‌ కళాశాలలో విద్యార్థుల పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను డీఈఓ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన, గౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాల స్థాయిలో రోల్‌ ప్లే, జానపద నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు జానపద నృత్య పోటీల్లో, 9వ తరగతి విద్యార్థులు రోల్‌ప్లే పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. జానపద నృత్య బృందంలో 4 నుంచి ఆరుగురు విద్యార్థులు ఉండాలని, ప్రదర్శన 5 నుంచి 6 నిమిషాల వ్యవధితో ఉండాలని సూచించారు. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం, లింగ సమానత్వం, మాదకద్రవ్యాల నివారణ, మానసిక ఆరోగ్యం, భద్రత తదితర అంశాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఉండాలన్నారు. ఈ నెల 9న మండల స్థాయి పోటీలు, 24న జిల్లా స్థాయి పోటీలు డైట్‌ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాకు నోడల్‌ అధికారిగా డి.శ్రీనివాసరావు (9440085753), పార్వతీపురం మన్యం జిల్లాకు ఎ.శశిభూషణరావు (8500042742)ను నియమించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డైట్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ దత్తి అప్పలనాయుడు, లెక్చరర్‌ వి.జిన్నంనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement