రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

Oct 4 2026 5:29 PM | Updated on Oct 4 2026 5:29 PM

ఉత్సాహంగా జిల్లా స్థాయి జూడో పోటీలు

భామిని: మండలంలోని సన్నాయికాలనీ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైక్‌లు ఢీకొని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భామిని నుంచి బొడ్డగూడ వైపు వెళ్తున్న బైక్‌.. బొడ్డగూడ నుంచి భామిని వస్తున్న బైక్‌ సన్నాయికాలనీ సమీపంలో ఢీకొన్నాయి. దీంతో రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న రాఘవరెడ్డి మురళి, బిడ్డిక ఆనంద్‌, బిడ్డిక నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడగా, బొడ్డగూడకు చెందిన బిడ్డిక బాలు, బిడ్డిక ప్రేమకుమార్‌ కూడా గాయపడ్డారు. వీరిని వెంటనే భామిని పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్సుల్లో సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

రామభద్రపురం: మండలంలోని ఆరికతోట ఉన్నత పాఠశాలలో శనివారం వ్యాయామ ఉపాధ్యాయుడు బొత్స రత్నకిషోర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్‌ 14, 17, 19 విభాగాలకు చెందిన బాల బాలికలకు జూడో పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లా స్థాయిలో సుమారు 30 పాఠశాలల నుంచి 350 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులు ఈ నెల 10, 11, 12 తేదీలలో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని రత్నకిషోర్‌ తెలిపారు. పోటీలను ఎంఈఓ తిరుమలప్రసాద్‌, ఆరికతోట తాజా మాజీ సర్పంచ్‌ పెంకి పుష్పమ్మ, హెచ్‌ఎం జి. కృష్ణవేణి ప్రారంభించారు. పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement