రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్‌ మృతి

Oct 4 2026 5:29 PM | Updated on Oct 4 2026 5:29 PM

రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్‌ మృతి

పూసపాటిరేగ : మండలంలోని కోనాడ జంక్షన్‌ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజమండ్రి నుంచి కారు మీదు వస్తుండగా పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్‌ వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరువంక గ్రామానికి చెందిన గున్న సృతి కాత్యాయని(26) విజయనగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. హామియో వైద్య కోర్సు పూర్తి చేసుకున్న సృతి కాత్యాయని అనుకోని ప్రమాదంలో రెప్పపాటు సమయంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూసపాటిరేగ ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్‌సీఎస్‌ ట్రస్టీ నాగరత్నం..

విజయనగరం రూరల్‌: ఎన్‌సీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ చైర్మన్‌ మాతృమూర్తి నారాయణం నాగరత్నం (84) శనివారం తుది శ్వాస విడిచారని ఎన్‌సీఎస్‌ ట్రస్టీలు నారాయణం శ్రీనివాస్‌ తెలిపారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ట్రస్టీ సభ్యులతో పాటు పట్టణ ప్రముఖులు నివాళులర్పించారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

గజపతినగరం: మండలంలోని పురిటిపెంట గ్రామానికి చెందిన లెంక రామునాయుడు(52) చికిత్స పొందుతూ విజయనగరం మహారాజా ఆస్పత్రిలో మృతి చెందినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌ శనివారం తెలిపారు. మృతుడు రాముడునాయుడు మద్యానికి బానిసై ఇంట్లో సమస్యలు పట్టించుకోకపోవడంతో భార్య సన్యాసమ్మ మందలించేది. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట కాలుజారి పడిపోవడంతో ఆపరేషన్‌ చేయాల్సి ఉండగా.. గాంధీ జయంతి రోజున రాత్రి పూటుగా తాగి వచ్చిన రామునాయుడును భార్య నిలదీసింది. ఇలా తాగేస్తే ఆపరేషన్‌ ఎలా చేయించేదంటూ నిలదీసింది. దీంతో గడ్డి మందు సేవించాడు. కుటుంబ సభ్యులు వెంటనే గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. భార్య సన్యాసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement