డీబీటీ విధానంలో చెల్లింపులు | - | Sakshi
Sakshi News home page

డీబీటీ విధానంలో చెల్లింపులు

Oct 4 2026 5:29 PM | Updated on Oct 4 2026 5:29 PM

చికెన్‌

బ్రాయిలర్‌

లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌

శ్రీ148 శ్రీ266 శ్రీ277

చికెన్‌

గుమ్మలక్ష్మీపురం: అటవీ ఉత్పత్తులు విక్రయించే గిరిజనులకు రాబోయే సీజన్‌ నుంచి డీబీటీ (డైరెక్ట్‌ బ్యాంకు ట్రాన్‌జేషన్‌) ద్వారా నగదు చెల్లింపులు చేపట్టనున్నట్టు పార్వతీపురం జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ ఎం.సాంబశివరావు తెలియజేశారు. ఈ మేరకు జీసీసీ ఎం.డి ఎస్‌.ఎస్‌.శోభిక, డీఎం జె.రామారావు ఆదేశాల మేరకు శనివారం ఆయన బ్రాంచ్‌ పరిధిలో గల గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఇజ్జకాయి గ్రామంలో ‘అటవీ ఉత్పత్తుల సేకరణ – అమ్మకాలు’పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి గ్రామస్తులతో మాట్లాడారు. నవంబర్‌ నెల నుంచి అటవీ ఫలసాయాలు లభ్యమయ్యే సీజన్‌ ప్రారంభమౌతుందని, నరమామిడి చెక్కలు, కరక్కాయలు, నల్లజీడి పిక్కలు, ముసిడిక పిక్కలు, చింతపండు వంటి ఉత్పత్తులు వరుసగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జీసీసీ ద్వారా నిర్వహిస్తున్న అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ జీసీసీ సిబ్బంది వాటిని మద్దతు ధరకు కొనుగోలు చేపడతారని, అటవీ ఉత్పత్తులను సేకరించే క్రమంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, వాటిని జీసీసీకి విక్రయించడం ద్వారా జీసీసీ వ్యాపారాభివృధ్ధికి తోడ్పాటునందివ్వాలని కోరారు. ఈ ఏడాది నుంచి కొనుగోలు చేసిన అటవీ ఉత్పత్తులకు సంబంధించిన నగదును నేరుగా ఇవ్వకుండా పాదర్శకత కోసం విక్రయించిన వ్యక్తి యొక్క బ్యాంకు ఖాతాలో 24 గంటల్లోగా జమయ్యేలా ప్రభుత్వం, జీసీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారన్నారు. ఈ విషయాల పట్ల గిరిజన ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈయన వెంట అకౌంటెంట్‌ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్‌ బి.సింహాచలం, సేల్స్‌మేన్‌లు జె.గోపాల్‌, గౌరీశంకర్‌ ఉన్నారు.

జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ ఎం.సాంబశివరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement