కారుణ్య నియామకాలకు చర్యలు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

కారుణ్య నియామకాలకు చర్యలు : ఎస్పీ

Oct 4 2026 5:29 PM | Updated on Oct 4 2026 5:29 PM

కారుణ్య నియామకాలకు చర్యలు : ఎస్పీ

విజయనగరం టౌన్‌: పోలీసు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం, ప్రమాదవశాత్తూ మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్వీస్‌ బెనిఫిట్స్‌, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు మినహా మిగిలిన కుటుంబాలకు అన్ని బెనిఫిట్స్‌ను ఇప్పటికే అందజేశామన్నారు. ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని, కొన్ని కుటుంబాలకు బెనిఫిట్స్‌ మృతి చెందిన పోలీసు కుటుంబాలకు త్వరితగతిన మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తున్నామన్నారు. పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టేందుకు అర్హతలు కలిగిన వ్యక్తులు వెంటనే ధ్రువపత్రాలను జిల్లా పోలీసు కార్యాలయానికి సకాలంలో అందజేస్తే, కారుణ్య నియామకాలకు చర్యలు చేపడతామన్నారు. మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఏ సందేహాలున్నా, సమస్యలున్నా, పోలీసు కార్యాలయ ఉద్యోగులను లేదా తనను నేరుగా సంప్రదించవచ్చనన్న భరోసాను కల్పించారు. కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ పి.కిరణ్‌కుమార్‌, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, జిల్లా పోలీసు కార్యాలయ ఉద్యోగులు, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement