అటవీ శాఖ చెబుతున్నదీ ‘అవాస్తవమే’నా? | - | Sakshi
Sakshi News home page

అటవీ శాఖ చెబుతున్నదీ ‘అవాస్తవమే’నా?

Oct 4 2026 5:29 PM | Updated on Oct 4 2026 5:29 PM

అటవీ శాఖ చెబుతున్నదీ ‘అవాస్తవమే’నా?

పార్వతీపురం రూరల్‌: మండలంలో గల గిరిజన గ్రామమైన సీతంపేటలో శనివారం ఉదయం జరిగిన రెవెన్యూ, అటవీ భూముల సంయుక్త సర్వేలో తహసీల్దార్‌ వ్యవహరించిన తీరుపై ఏపీ గిరిజన కార్మిక సంఘం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సాక్షాత్తూ అటవీశాఖ సిబ్బంది క్షేత్ర స్థాయికి వచ్చి, రాతపూర్వక ఆధారాలతో హద్దులు చూపిస్తున్నా.. తహసీల్దార్‌ కావాలనే వాటిని అవాస్తవాలుగా కొట్టిపారేస్తూ, దాటవేసే ధోరణితో వ్యవహరించారని సంఘం నాయకుడు పి.రాము ఆరోపించారు. ఈ పరిశీలనలో.. ‘ఈ భూమి మాది, ఇది మాది కాదు’ అని అటవీ శాఖ గార్డు స్పష్టంగా చెబుతున్నా తహసీల్దార్‌ కనీసం చెవికెక్కించుకోలేదన్నారు. పైగా ‘ఇదంతా మీదే.. మీరెందుకు అబద్ధాలు చెబుతున్నారు’ అంటూ అటవీశాఖ అధికారులనే తహసీల్దార్‌ దబాయించడం ఆయన ఏకపక్ష వైఖరికి అద్దం పడుతోందని రాము మండిపడ్డారు. గిరిజనులకు 15 రోజుల్లో పట్టాలు అందజేయాలని సాక్షాత్తూ జాయింట్‌ కలెక్టర్‌ డా. ఆర్‌.వైశాలి ఆదేశించినా, తహసీల్దార్‌ మాత్రం అక్కడే ఉన్న గిరిజన రైతులను మాట్లాడనివ్వకుండా గిరిజనుల భూహక్కులకు గండికొట్టేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. తహసీల్దార్‌ దబాయింపులను, అన్యాయమైన తీరును ఎండగడుతూ స్థానిక గిరిజన రైతులతో కలిసి సాయంత్రం కలెక్టరేట్‌కు చేరుకున్న రాము.. డీఆర్‌ఓ కె.హేమలతకు వాస్తవాలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement