పోస్టుల భర్తీ ఎప్పుడు మరి? సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి జూలై 1న ప్రకటన విడుదల ఆరు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 270 మంది
ప్రభుత్వ ఆదేశాలతోనే...
విజయనగరం ఫోర్ట్:
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తు న్న తీరు నిరుద్యోగులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు ప్రస్తుతం అవలంభిస్తున్న పాలనా విధానాలతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా వైద్య రంగంలో పోస్టుల భర్తీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరుద్యోగులను టెన్షన్‌కు గురిచేస్తుంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ వ్యవహారంలోనూ చంద్రబాబు ఇదే తరహాలో వ్యవహరించడం నిరుద్యోగుల నిరాశకు కారణమవుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి సుమారు రెండేళ్ల కిందట నోటిఫికే షన్ ఇచ్చారు. ఆ పోస్టులను నేటికీ భర్తీ చేయలేదు. పోస్టులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ అభ్యర్థులను విధుల్లో చేర్చుకోలేదు. వైద్య కళాశాల అధికారులు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి కూడా విధుల్లో చేర్చుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎంపికై న అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ (సెకండరీ హె ల్త్) వారు జూలై 1వ తేదీన ఆరు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోవడానికి 10వ తేదీవరకు గడువు ఇచ్చారు. జనరల్ డ్యూటీ అటెండెంట్(జీడీఏ) పోస్టులు – 4, ల్యాబ్ అటెండెంట్ పోస్టు–1, థియేటర్ అసిస్టెంట్ పోస్టు–1కి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తేదీ నాటికి జీడీఏ పోస్టులకు 175 దరఖాస్తులు, ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్టుకు 25 దరఖాస్తులు, థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు 70 మంది దరఖాస్తు చేసుకున్నారు.
గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట ముందుగా ప్రొవిజెనల్ మెరిట్ జాబితా వెబ్‌సైట్‌లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించాలి. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ మెరిట్ జాబితా వెబ్‌సైట్‌లో పెట్టి ఎంపికై న వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. అయితే సెకండరీ హెల్త్ అధికారులు ఈ పక్రియ ఏది చేపట్టకుండా దరఖాస్తుల తీసుకోవడంతోనే సరిపెట్టేశారు. పోస్టులు భర్తీ ఎప్పుడు చేపడతారని దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారులను అడిగితే పోస్టుల భర్తీ పక్రియ నిలిపివేశామని తేల్చి చెప్పారు. దీంతో సదరు అభ్యర్థులు అవాక్కయ్యారు. ఎంతో ఆశతో పోస్టు కోసం దరఖాస్తు చేస్తే భర్తీ నిలిపివేశామని చెప్పడం ఏంటని ఆవేదన చెందుతున్నారు.
జిల్లాల పునర్విభజన జరుగుతున్నందున పోస్టు లు భర్తీగాని, బదిలీలుగాని చేపట్టవద్దని ప్రభు త్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుచేత పో స్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేశాం. మళ్లీ ఆదేశాలు వచ్చిన తరువాతే భర్తీ ప్రక్రియ చేపడతాం.
– డాక్టర్ పద్మశ్రీ రాణి, డీసీహెచ్‌ఎస్


