● క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సూచనలివ్వాలని కలెక్టర్ పిలుపు
విజయనగరం గంటస్తంభం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్) ద్వారా అందుతున్న సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు పరిష్కా రం అనంతరం సంబంధిత కార్యాలయాల్లో ఏర్పా టు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. జిల్లాలోని కలెక్టరేట్, ఆర్‌డీఓ, తహసీల్దా ర్, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ/వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.
నేడు పీజీఆర్‌ఎస్
జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయి శాఖల అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అర్జీలతో పాటు పూర్తి వివరాలు, ఆధార పత్రాలు సమర్పించాలని, గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత రశీదును తీసుకురావాలని సూచించా రు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, ఆన్‌లైన్ లేదా మండల, మున్సిపల్ కార్యాలయాల ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.


