విజయనగరం: ఎల్‌నినో ప్రతికూల పరిస్థితుల నేప థ్యంలో పశుగ్రాసం, పప్పుధాన్యాలు, నూనెగింజల కొరత ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉందని, ఈ సవాళ్లను అధిగమించేందుకు రైతాంగం సన్న ద్ధం కావాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) డాక్టర్ పాలడుగు సత్యనారాయణ సూచించారు. విజయనగరంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ‘ఎల్‌నినో నేపథ్యంలో సృజనాత్మక రైతులు – శాస్త్రవేత్తల చర్చాగోష్టి’ కార్యక్రమం డాక్టర్ టి.ఎస్.ఎస్.కె.పాత్ర అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడారు. ఎల్‌నినో వల్ల పంటలు దెబ్బతిన్న గ్రామాల్లో ఆగస్టు 3వ తేదీ నుంచి విస్తృత పర్యటనలు నిర్వహించాల ని ఆదేశించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,000మంది వ్యవసాయ విద్యార్థులు, 400 మంది శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించి, రైతులకు అవసరమైన సలహాలు, సూచన లు అందిస్తారని పేర్కొన్నారు.
‘అంగ్రూ కిసాన్ నెట్‌వర్క్’ ఏర్పాటు
వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికతను వేగంగా చేరవేసేందుకు వీలుగా రాష్ట్రంలో 3,500 మంది సృజనాత్మక (ఆవిష్కరణల) రైతులతో ’అంగ్రూ కిసాన్ నెట్‌వర్క్’ ఏర్పాటు చేస్తున్నట్లు వీసీ ప్రకటించారు. వీరి ద్వారా నూతన సాంకేతిక పరి జ్ఞానాన్ని ఇతర రైతులకు విస్తతంగా ప్రచారం చేస్తామన్నారు. ముందుగా ఏరువాక కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ కె.లక్ష్మణ్ విజయనగరం జిల్లాలో ఎల్‌ని నో ప్రభావం – ప్రస్తుత పంటల పరిస్థితిపై నివేదిక సమర్పించారు. అనంతరం సభ్యులు కె.వి. సూర్యనారాయణరాజు, ఎల్.శాంతి, పడాల భూదేవి, సరస్వతి, మరియు అంగ్రూ ప్రతినిధి ప్రకాష్ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సమావేశంలో పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ అనురాధ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ స్వాతి, డాక్టర్ శ్రీనివాస్, డాక్ట ర్ తేజేశ్వరరావులతో పాటు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


