భూములు లాక్కుంటారా? | - | Sakshi
Sakshi News home page

భూములు లాక్కుంటారా?

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

పరిహారం చెల్లించకుండా భూములు లాక్కుంటారా? 2.27 ఎకరాలకు రూ.9 లక్షలే ఇచ్చారు

బలిఘట్టం రైతుల ఆందోళన

కొత్తవలస ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

ఎవరిని అడగాలి

ఇదెక్కడి చెల్లింపు...

పట్టించుకోలేదు

పరిహారం చెల్లించకుండా

మేము ముగ్గు రం అన్నదమ్ములం. సర్వే నంబ ర్‌ 141–4లోని 2.27 ఎకరాల భూమిని అధికారులు తీసుకున్నారు. అప్పట్లో ఎకరాకు రూ.11లక్షల పరిహారం అందజేస్తామ ని తెలిపారు. తీరా కేవలం రూ.9 లక్షలు మాత్ర మే మా ఖాతాలకు జమచేశారు. మిగిలిన రూ. 15.97 లక్షల సొమ్మును అడిగితే ఇచ్చేశాం అంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలి?

– డోకుల దేముడు, కృష్ణ, బాధిత రైతులు,

బలిఘట్టం

కొత్తవలస:

మ సాగు భూములకు తగిన పరిహారం చెల్లించకుండా ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) పార్కు పనులు ఎలా చేపడతారంటూ మండలంలోని బలిఘట్టం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్కు నిర్మాణ పనులను సోమవారం అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం పరిహారం అందించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అరకొర పరిహారం అందించి భూములను లాక్కోవడం తగదని వాపోయారు.

ఇదీ పరిస్థితి...

గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 2018 సంవత్సరంలో బలిఘట్టం గ్రామ రెవెన్యూ పరిధిలో 57.02 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక వాడ నిర్మాణానికి సేకరించింది. అప్పట్లో అరకొర పరిహారం రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేశారు. ఇంతలో ప్రభుత్వం మారింది. ఏపీఐసీ భూముల ఊసెత్తలేదు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తామంటూ 2025 మే1వ తేదీన అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. అప్పట్లోనే రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించకుండా పార్కు శంకుస్థాపన పూజలు చేయడం తగదని బాధిత రైతులు ఆందోళన చేశారు. ఆయనకు వినత పత్రం అందజేశారు. వారం రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా విస్మరించారు. ఇప్పుడు దౌర్జన్యంగా సాగుభూముల్లో పార్కు పనులు తలపెట్టడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇచ్చేశామంటూ అధికారులు చెబుతుండడంపై మండిపడుతున్నారు. తమ ఖాతాలను పరిశీలించాలని, ఎవరి ఖాతాలకు డబ్బులు జమయ్యాయో నిర్ధారించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్‌ ఎస్‌.రామలక్ష్మి మాట్లాడుతూ భూసేకరణ 2018 సంవత్సరంలోనే జరిగిపోయిందని, రైతుల ఖాతాలకు ఎంఎస్‌ఎంఈ అధికారులు పరిహారం జమచేశారన్నారు. ఇంతకు మించి తనకు తెలియదని చెప్పుకొచ్చారు.

నాకు సర్వే నంబర్‌ 141లో ఎకరా 45 సెంట్లు భూమిని అధికారులు తీసుకున్నారు. దీనికి సంబంధించి కొత్తవలస కెనరా బ్యాంకు ఖాతాలో కేవలం రూ 3.75 లక్షలు మాత్రమే జమ చేశారు. మిగిలిన డబ్బులు అడిగితే మీ బ్యాంకు ఖాతాలకు జమ చేశామంటున్నారు. ఇదెక్కడి అన్యాయం. ఎవరిని అడగాలి?.

– యడ్ల దేముడమ్మ, బాధితురాలు, బలిఘట్టం

పార్కు నిర్మాణానికి సర్వే నంబర్‌ 141–26లో 19 సెంట్లు భూమికి పరిహారం అందించారు. సర్వే నంబర్‌ 141–45 లోగల 18 సెంట్లు భూమికి పరిహారం అందించలేదు. అడిగితే మీ ఖాతాలకు జమ చేసేశాం అంటున్నారు. బ్యాంకు స్టేట్‌ మెంట్‌లు చూపించి అడిగినా ఫలితం శూన్యం. రైతులకు పరిహా రం అందించకుండా ఎలా నిర్మాణాలు సాగిస్తారు.

– పోరాపు అప్పారావు,నాగేశ్వరరావు, బలిఘట్టం

నాతో పాటు మా కుంటు సభ్యులైన 20 మందికి సర్వే నంబర్‌ 141లో 36, 38 సబ్‌డివిజన్‌లో 4.80 ఎకరాల భూమి ఉంది. మొత్తం భూమిని అధి కారులు తీసుకున్నారు. మాకు మాత్రం కేవలం రూ 2.20 లక్షలు మాత్రమే పరిహారం అందజేశారు. మిగిలిన డబ్బులు మా ఖాతాలకు జమ చేశాం అంటున్నారు. మా ఖాతాలను పూర్తిగా విచారించి నిరూపించాలి. అసలు ఈ సొమ్ము ఎవరి ఖాతాలకు వెళ్లిందో నిర్ధారించాలి.

– ఆకుల శ్రీనివాసరావు, బాధితుడు, బలిఘట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement