400 క్యూసెక్కుల నీరు విడుదల | - | Sakshi
Sakshi News home page

400 క్యూసెక్కుల నీరు విడుదల

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

400 క్యూసెక్కుల నీరు విడుదల డీఎస్సీ అక్రమాలపై దాటవేత పీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు జనసమీకరణకు పాట్లు

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములనాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు మొత్తంగా 400 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నట్టు ఏఈ నితిన్‌ తెలిపారు. గతంలో 300 క్యూసెక్కుల నీరు సరఫరా చేయగా, సాగునీటి అవసరాల దృష్ట్యా మరో 100 క్యూసెక్కుల నీటి సరఫరాను పెంపుదల చేశామన్నారు.

విజయనగరం అర్బన్‌: శాసన మండ లి విపక్షనేత బొత్స సత్యనారాయణ డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ సమస్యల పై లేవనెత్తిన ప్రజా సమస్యలను పక్కదా రి పట్టించేలా ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రద ర్శిస్తోంది. డీఎస్సీ నిర్వహణలో విమర్శలు, అభ్యర్థుల ఆందోళనలకు నేరుగా సమాధానం చెప్పలేక ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు. తన క్యాంప్‌ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడిన తీరు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నంలా కనిపించింది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ ప్రక్రియలో జరిగిన లోపాలపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తుంటే దానికి స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం. నిరుద్యోగులు, యువత తరఫున వైఎస్సార్‌సీ పీ మంగళవారం చేపడుతున్న ధర్నాకు వస్తున్న మద్దతును చూసి ప్రభుత్వం భయపడుతోందని మంత్రి మాటల్లో స్పష్టమవుతోంది.

భోగాపురం నిర్వాసితుల కష్టాలు పట్టవా?

భోగాపురం విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రా రంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నా మని చెబుతున్న ప్రభుత్వం, దానికి భూములి చ్చిన పేద నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. వైజాగ్‌ ట్రిబ్యునల్‌ లో 20 కేసులు, హైకోర్డులో 50కి పైగా కేసులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రారంభోత్సవానికి ఉన్న అత్యుత్సాహం, భూ నిర్వాసితుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో చూపించడం లేదనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. దాదాపు 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ పేరిట కోట్లాదిరూపాయ లు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారే తప్ప, క్షేత్ర స్థాయిలో ఉపాధి కోల్పోయిన స్థానిక యువత కు స్పష్టమైన హామీ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.

పూసపాటిరేగ/విజయనగరం అర్బన్‌: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. మరో నాలుగు రోజులే గడువు ఉండడంతో ఏర్పాట్లను వేగవంతం చేశారు. కలెక్టర్‌ ఎస్‌ రాంసుందర్‌ రెడ్డి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం, జీఎంఆర్‌ సంస్థ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని పాల్గొనే వేదిక ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. బహిరంగ సభలో జనం కూర్చోడానికి ఇప్పటికే భారీ జర్మన్‌ హ్యాంగెర్లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు, సమీపంలోనే కంట్రోల్‌ రూమ్‌ను సిద్ధం చేస్తున్నారు. వీఐపీ పార్కింగ్‌, సాధారణ వాహనాల పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్‌కు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

●భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సమర్ధవంతంగా పర్యవేక్షించేందుకు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ‘కోర్‌ కంట్రోల్‌ రూం’ను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి ఆగస్టు 1 వరకు 24 గంటలపాటు షిప్టుల వారీగా పనిచేసేలా వివిధ నియోజకవర్గాలకు అధికారులను ఇన్‌చార్జిలు గా నియమించారు.

పీఎం సభకు జనసమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం అధికారులపై కత్తిపెట్టింది. గ్రామా లకు బస్సులు పంపించి ఉదయం 5 గంటలకే భోగాపురం తరలించాలని టార్గెట్‌ ఫిక్స్‌ చేసి నట్టు సమాచారం. ఉపాధిహామీ వేతనదారు లు, డ్వాకా మహిళలు బస్సులు ఎక్కిన తర్వాత ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement